News October 7, 2025

‘న్యూ ఇండియా పార్టీ’కి షోకాజ్ నోటీస్ జారీ: కలెక్టర్

image

ఆడిట్ రిపోర్టులు సమర్పించకపోవడంతో న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు PDPL జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు. 2021- 24 ఏడాదులకు చెందిన ఆడిట్ అకౌంట్స్‌ అందజేయలేదని, ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 29ఏ ప్రకారం ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్దిష్ట వ్యవధిలో సమాధానం ఇవ్వకపోతే, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తింపు రద్దు వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News October 7, 2025

ఏలూరు: కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి

image

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కె. వెట్రిసెల్వి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలు, ఏడు కాండములతో కూడిన అద్భుత రామాయణాన్ని మానవాళికి అందించారని కలెక్టర్ కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుందని ఆమె అన్నారు.

News October 7, 2025

గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదెందుకు: షర్మిల

image

AP: విశాఖ KGHలో చికిత్స పొందుతున్న <<17923468>>గురుకులాల<<>> పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని APCC చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వారి శరీరాలు చూస్తే ఏం ఆహారం పెడుతున్నారో కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దుయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

News October 7, 2025

అత్యవసరమైతే ఇంటర్నెట్ డేటా పొందొచ్చు!

image

ఒక్కోసారి బ్యాలెన్స్ అయిపోయి యూజర్లు ఇబ్బందిపడుతుంటారు. అయితే డేటా బ్యాలెన్స్ అయిపోయినప్పుడు అత్యవసరమైతే 1GB డేటా(₹11) పొందే అవకాశాన్ని ఆపరేటర్లు అందిస్తున్నాయి. MyJio యాప్‌లో ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ ద్వారా 1GB డేటా పొందొచ్చు. *567*3#/ *141*567#కు డయల్ చేసి 500MB లేదా 1GB డేటా పొందొచ్చు. అలాగే Vi నంబర్ నుంచి 121249 డయల్ చేసి డేటా లోన్ పొందొచ్చు. *ఇవి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT