News December 31, 2025

న్యూ ఇయర్.. ప్రత్యేక తనిఖీలు: VKB SP

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో SHOలు ప్రత్యేక బృందాలతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్, విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తారని SP స్నేహ మెహ్రా తెలిపారు. వేడుకల ముసుగులో ఎక్కడైనా ఈవ్ టీజింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

మహబూబాబాద్‌లో పులి.. నిఘా పెంపు.!

image

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పులి అలజడి మొదలైంది. గంగారం, కొత్తగూడ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. రాంపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామస్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే, పులులు తోడు కోసం ఈ సమయంలో అటవీ ప్రాంతాలకు రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

News January 1, 2026

నల్గొండ: 25 జీపీల్లో నూతన అకౌంట్లు

image

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన 25 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.

News January 1, 2026

నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

image

న్యూ ఇయర్ రోజున నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిలలకు తండ్రి విషం కలిపిన పాలు తాపించి చంపాడు. ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు సురేంద్ర (35), కావ్యశ్రీ (7), సూర్య గగన్ (2), ధ్యానేశ్వరి (4)గా గుర్తించారు. సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.