News December 31, 2025

న్యూ ఇయర్ వేడుకలకు దూరం

image

న్యూ ఇయర్ వేడుకలకు ఈ ఏడాది దూరంగా ఉండనున్నట్లు పరిటాల కుటుంబం ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుడు గుంటూరు రామాంజినేయులు అమెరికాలో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, వెంకటాపురం, ధర్మవరంలో ఎక్కడా వేడుకలు నిర్వహించడం లేదని, అభిమానులు గమనించాలని కోరారు.

Similar News

News December 31, 2025

విద్యుత్ షాక్‌తో సత్యసాయి జిల్లా యువకుడు మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల మేరకు.. రొళ్ల మండలం అలుపనపల్లి గ్రామానికి చెందిన శిరీష్ రెడ్డి (26) GN పాళ్యం వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద కనెక్షన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News December 31, 2025

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ఏకాగ్రతతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాహసవంతులైన చిన్నారుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

News December 31, 2025

ముందు బాబులను వెంటాడుతున్న డ్రోన్ కెమెరాలు

image

న్యూ ఇయర్ వేడుకల వేళ కాకినాడ జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి మందుబాబుల ఆగడాలను కట్టడి చేసేందుకు కాకినాడ సిటీ, రూరల్, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రాంతాల్లో ఎస్ హెచ్ ఓలు గగనతలం నుంచి పర్యవేక్షణ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని, అనుమానితులను వెనువెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల ఈ హైటెక్ నిఘాతో హుందీగా వేడుకలు జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.