News December 29, 2025
న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. వేడుకల నిర్వహణపై పలు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజేలు ఏర్పాటు చేయడం, ర్యాలీలు తీయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. రహదారులపై కేక్ కటింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు.
Similar News
News December 31, 2025
జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు: SP విద్యాసాగర్

కృష్ణా జిల్లా ప్రజలకు SP విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. వేడుకల పేరుతో జనజీవనానికి ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
News December 31, 2025
GNT: ‘ఆంధ్రా ఆర్నాల్డ్’ పిల్లలమర్రి వేంకట హనుమంతరావు

ప్రముఖ రచయిత, విమర్శకులు పిల్లలమర్రి వేంకట హనుమంతరావు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో 1918లో జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేసి, గుంటూరు హిందూ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. కవిగా, విమర్శకుడిగా రాణించి ‘ఆంధ్రా ఆర్నాల్డ్’, ‘సాహిత్యాచార్య’ వంటి బిరుదులు సొంతం చేసుకున్నారు. ‘సాహిత్య సంపద’, ‘మధుకణములు’ వంటి ఎన్నో రచనలు చేశారు. వీరి భార్య సుశీల కూడా రచయిత్రి కావడం విశేషం.
News December 31, 2025
25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్‌లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్‌సైట్: ssc.gov.in


