News March 27, 2025
పంగులూరు: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగులూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవాడ గ్రామానికి చెందిన ప్రవల్లిక అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని ఇంట్లో వాళ్లు మందలించడంతో మనస్థాపన చెంది, బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 30, 2025
టెన్త్ పాసై ఈత వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు

నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/
News March 30, 2025
రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఆళ్లగడ్డ

నంద్యాల జిల్లాలో కొద్దిరోజులుగా భానుడు భగభగ మండుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం.. ఆదివారం 41.5°C ఉష్ణోగ్రతతో ఆళ్లగడ్డ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 30, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరులో జిల్లా జైలులో మహిళ ముద్దాయి అనుమానాస్పదస్థితిలో మృతి* ఏలూరు గిరిజన భవన్ లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్*పెట్రోల్ పోసి వృద్ధురాలిని హతమార్చిన కేసులో వ్యక్తి అరెస్ట్*పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని జీలుగుమిల్లిలో ర్యాలీ*కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి