News July 29, 2024

పంచాయతీలలో సమస్యలపై కాల్ సెంటర్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లా 30 మండలాల పరిధిలోని పంచాయితీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధిలైట్ల నిర్వహణ, పంచాయతీల ఫిర్యాదులకు సంబంధించి జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జిల్లాస్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

Similar News

News October 1, 2024

కడప: ప్లాస్టిక్ తీసుకువస్తే బహుమతులు పొందవచ్చు

image

ఇళ్లలో, కార్యాలయాల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువస్తే ఉపయోగపడే పునర్వినియోగ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి బహుమతులు తీసుకువెళ్లండి పోస్టర్లను ఆవిష్కరించారు. నగర పరిధిలోని రాజీవ్ పార్క్ నందు అక్టోబర్ 1 తేదీన సాయంత్రం ఇనుప వస్తువులు స్వీకరిస్తారని చెప్పారు.

News October 1, 2024

కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు

image

జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.

News September 30, 2024

కడప: స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

కడప జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మిషన్ శక్తి పథకం ద్వారా నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్, న్యూ రిమ్స్ కడప నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుంచి పొందగలరన్నారు. అర్హతల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు అర్హులైన వారు అక్టోబర్ 10 సాయంత్రం 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.