News February 12, 2025

పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: డీపీవో

image

పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ములుగు జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, నియమాలకు లోబడి నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు రామకృష్ణ, రహిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలు

image

కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో Polling staff కీలక పాత్ర వహించాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News February 12, 2025

రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ

image

దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News February 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

error: Content is protected !!