News February 14, 2025
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
Similar News
News December 23, 2025
సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో దారుణం జరిగింది. పశువులను మేపుతున్న సుజాత(40) మెడలోని బంగారం ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన సుజాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
News December 23, 2025
మేడారానికి 36 రోజులే.. నత్తనడకన పనులు!

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సరిగ్గా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. జాతర ప్రాంతంలో జరుగుతున్న పనులు నెమ్మదిగా కొనసాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జాతర పనులను సమ్మక్క మాల ధరించి అధికారులు అందరూ ఇక్కడే ఉండి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా, అంతా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
News December 23, 2025
ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.


