News February 14, 2025

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ, RO, AROల విధులు తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.

Similar News

News November 3, 2025

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. దీనిని ప్రారంభించిన ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. సమాజ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను ధారపోసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

News November 3, 2025

సమీకృత వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు

image

జనాభా పెరుగుదలకు సరిపడే ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, పశువుల పెంపకం వల్ల వచ్చే వ్యర్థాలను సమర్థంగా వినియోగించి భూసారాన్ని పెంచవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో సాగుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సమగ్ర వ్యవసాయం నుంచి వచ్చే గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనే వల్ల రైతులకు నికర ఆదాయం లభిస్తుంది. సమగ్ర వ్యవసాయంతో ఏడాది పొడవునా ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది.

News November 3, 2025

సిద్దిపేట: ‘దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

సిద్దిపేట జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ లో లెవెల్ వంతెనలు, కల్వర్టులు, రోడ్లు శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.