News November 21, 2025
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 22, 2025
ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
News November 22, 2025
‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.


