News December 16, 2025

పంచాయతీ పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: ఎస్పీ రోహిత్ రాజు

image

భద్రాద్రి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 1288 పోలింగ్ కేంద్రాల్లో 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News December 17, 2025

బర్త్‌డే విషెస్.. CBN, పవన్‌కు షర్మిల థాంక్స్

image

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.

News December 17, 2025

నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించండి: పురందీశ్వరి

image

RJY, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో గతంలో నిలిపిన రైళ్లను పునఃప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి కోరారు. బుధవారం పార్లమెంట్‌‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కోవిడ్‌ అనంతరం రద్దయిన రైలు హాల్టింగ్‌లను పునరుద్ధరించాలని, రానున్న పుష్కరాల దృష్ట్యా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.

News December 17, 2025

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

image

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే సిద్ధమైంది. స్లీపర్, ఏసీ 3 టైర్‌లో ప్రయాణికులు 40Kgలు, 2nd AC ప్యాసింజర్లు 50Kgలు, 1st క్లాస్‌ ప్రయాణికులకు 70Kgల వరకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. జనరల్‌ బోగీలో ప్రయాణించే వాళ్లు 35Kgల లగేజీ తీసుకెళ్లవచ్చు. 5-12 ఏళ్ల పిల్లలకు ఆ పరిమితిలో 50% లేదా గరిష్ఠంగా 50Kgల వరకు అనుమతి ఉంటుంది. పరిమితి మించితే అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.