News October 28, 2024

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రా లకు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో (ప్రతి ఆదివారం) డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News February 25, 2026

నల్గొండ: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 25, 2026

నల్గొండ: నిధుల లేమితో డీఆర్డీఏ సతమతం

image

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఖజానా ఖాళీ కావడంతో ఆరు నెలలుగా సుమారు రూ.60 వేల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎప్పుడు కరెంటు కోత విధిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం స్టేషనరీ ఖర్చులకు కూడా నిధులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారింది.