News October 12, 2025

పంజాగుట్ట యాక్సిడెంట్ మృతిచెందింది వీరే!

image

పంజాగుట్ట PS పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో రాపిడో డ్రైవర్ ముద్ధంగల్ నవీన్(30) అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సవారీ చేసిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు లారీ డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 12, 2025

IMA కరీంనగర్ అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజ

image

2025–26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం(IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా.ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.

News October 12, 2025

నిర్మల్: ఈ నెల 14 జిల్లా బ్యాట్మెంటన్ జట్ల ఎంపిక

image

U- 14, 17 జిల్లాస్థాయి బ్యాట్మెంటన్ బాలబాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయంలో హాజరుకావాలని సూచించారు.

News October 12, 2025

కాంగ్రేస్ జిల్లా అధ్యక్ష బరిలో 8 మంది దరఖాస్తులు

image

జయశంకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన జిల్లాకు చెందిన నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తూ తమ బయోడేటాను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డికి దరఖాస్తులను అందజేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పేర్లను త్వరలో అధిష్ఠానానికి పంపి ఎంపిక చేయనున్నారు.