News July 7, 2025
పంటల బీమా నమోదు చేయించుకోండి: కలెక్టర్

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రైతులు నమోదు చేయించుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావుతో కలిసి బీమా పోస్టర్లు విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దిగుబడుల ఆధారంగా పంటల బీమా కింద కంది, వరి, మొక్కజొన్న, ఆముదం, రాగి పంటలు ఉన్నాయన్నారు.
Similar News
News July 7, 2025
మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 7, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 7, 2025
JGTL: కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL బస్సు

పౌర్ణమి సందర్భంగా కోరుట్ల నుంచి తిరువన్నమలై(అరుణాచలం)కి కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. రేపు బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తరువాత రాత్రికి అరుణాచలానికి చేరుకుంటుంది. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ ఆలయ దర్శనం ఉంటుందని, పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,800ల టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు.