News December 9, 2025

పంటు రాకపోకలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

గోదావరి నదిపై పంటు రాకపోకలు రవాణా రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌ల్యాండ్ వెసెల్స్ యాక్ట్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ పంటు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద జల వనరులు, పంచాయతీరాజ్, ఆర్డీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సోంపల్లి, నర్సాపురం, కోటిపల్లి రేవుల వద్ద పంటు రాకపోకలపై సమీక్షించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చర్చించారు.

Similar News

News December 20, 2025

పోలీస్‌ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ

image

కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.

News December 20, 2025

నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

image

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.

News December 20, 2025

ఉద్యోగ యోగాన్ని కల్పించే ‘బెంగళూరు గణేష్’

image

బెంగళూరు జయనగర్‌లోని కెరీర్ వినాయక ఆలయం నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పదోన్నతులు కోరేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. సంకల్ప పూజలు, ప్రదక్షిణలతో నిరుద్యోగులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. విద్యావంతులు, యువతతో ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి భరోసాను కల్పిస్తోంది.