News February 5, 2025
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News February 5, 2025
ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ!
నిన్న ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేశ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ఏపీ, బిహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్‌లో ‘జన్ సురాజ్’ పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
News February 5, 2025
₹96,862Crతో ఏపీలో BPCL రిఫైనరీ: కేంద్ర మంత్రి
నెల్లూరు(D) రామాయపట్నం పోర్టు సమీపంలో BPCL రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. 6వేల ఎకరాల్లో ₹96,862Crతో దీన్ని నిర్మించనుందని రాజ్యసభలో చెప్పారు. ఏటా 9-12 మి.టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పుతామన్నారు. MP మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. పెట్టుబడిలో 75 శాతాన్ని ప్రోత్సాహకాల రూపంలో 25 ఏళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
News February 5, 2025
రేపు విద్యాకమిషన్ సదస్సు.. UGC నిబంధనలపై చర్చ
TG: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనలపై చర్చించేందుకు విద్యాకమిషన్ రేపు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనుంది. వర్సిటీల్లో ఆచార్యులు, ఉపకులపతుల నియామకాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనలే ప్రధాన చర్చనీయాంశంగా తెలుస్తోంది. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, తిరుపతిరావు తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం.