News February 5, 2025

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

image

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News April 14, 2026

మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

image

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.

News April 14, 2026

SSS: జిల్లాలో ముగ్గురు ఎస్సైలు బదిలీ

image

శ్రీ సత్య సాయి జిల్లాలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో పనిచేస్తున్న రాజకుళ్లాయప్పను పుట్టపర్తి రూరల్ పీఎస్‌కు, రంగడు యాదవ్‌ను అగళి పోలీస్ స్టేషన్‌కు, మరో మహిళా ఎస్సై గౌతమిని వీఆర్ నుంచి కదిరి రూరల్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News April 14, 2026

రాష్ట్ర టాపర్‌గా గట్టు విద్యార్థిని లావణ్య

image

గట్టు మండలంలోని రాయపురంలో పుట్టిన వాల్మీకి బోయ లావణ్య, రోజువారీ కూలీ పని చేసి కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రుల మధ్య పెరిగిన ఆమె, పేదరికాన్ని అడ్డంకిగా కాకుండా ఆయుధంగా మార్చుకుంది. గురుకుల విద్యతో ముందుకు సాగి రాష్ట్రస్థాయిలో BiPCలో 990/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ విద్యార్థులు లక్షలు ఖర్చు చేసినా సాధించలేనిది ఈ అమ్మాయి సాధించింది. అనేక పేద విద్యార్థులకు వెలుగు దీపంగా మారింది.