News November 28, 2025
పంట నష్టం నివారణ చర్చలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఏలూరు జిలాల్లో ఈనెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ప్రస్తుతం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో ముమ్మరంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ముదిగొండలో ఎన్నికల నిబంధనలపై ఏసీపీ అవగాహన కార్యక్రమం
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News November 28, 2025
HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

హైదరాబాద్‌లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.


