News October 30, 2025
పంట నష్టం నివేధికను తయారు చేయాలి: కలెక్టర్

జిల్లాలో తుపాను ప్రభావం వల్ల పంట నష్టాల నివేధికను తయారు చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో ఆయన మాట్లాడారు. తుపాను ప్రభావంవల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు, కృష్ణా నది, నల్లమడ కాలువలు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు.
Similar News
News October 30, 2025
ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.
News October 30, 2025
రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

రెబ్బెన PSను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సిబ్బంది అందరితో మాట్లాడారు. అనతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డ్స్‌ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రిసెప్షన్, పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
News October 30, 2025
ఏలూరు: 664 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం

జిల్లాలో 28 మండలాలలోని 664 గ్రామాలలో తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు గురువారం తెలిపారు. జిల్లాలో విద్యుత్, రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్న కారణంగా రూ.72.26 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. 30 టన్నుల బియ్యం, 10 టన్నుల నిత్యావసర సరుకులు, 3 టన్నుల కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించామన్నారు. 18 ఇళ్లు దెబ్బతిన్నాయని, 5 పశువులు మృతి చెందాయని తెలిపారు.


