News March 19, 2025

పంట రుణాలు విరివిగా పంపిణీ చేయాలి: అ.కలెక్టర్

image

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.

Similar News

News March 19, 2025

బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

image

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 18, 2025

NZB: ఇంటర్ పరీక్షలకు 475 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు 2వ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు గాను 16,291 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు.

News March 18, 2025

NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

image

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు.

error: Content is protected !!