News October 18, 2025

పండగకు ఊరెళ్తున్నారా? జర జాగ్రత్త: SP

image

దీపావళి పండుగ వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో దొంగలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు తమ వస్తువులు, డబ్బు, నగలను పట్ల కనిపెట్టుకుని ఉండాలన్నారు. ఒక వేళ మీ వస్తువులు దొంగిలించబడిన వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని SP కోరారు.

Similar News

News October 18, 2025

మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

image

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్‌లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.

News October 18, 2025

పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

image

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

News October 18, 2025

పల్నాడు పోలీసుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

image

నరసరావుపేటలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు శ్రమదానంలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లు, పరేడ్ గ్రౌండ్, ప్రధాన కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు సిబ్బంది. పరిశుభ్రతతో ఆరోగ్యం కాపాడుకుందాం అని ఎస్పీ బి. కృష్ణారావు పిలుపునిచ్చారు.