News March 30, 2025
పండగలు మన దేశ సంస్కృతిలో భాగం – CM

పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.
Similar News
News April 1, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు ☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ ☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు ☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం ☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు ☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు ☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు
News April 1, 2025
కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..
News April 1, 2025
ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.