News January 12, 2026

పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

image

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.

Similar News

News February 25, 2026

పాకిస్థానీల బెదిరింపులు.. లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ బంద్!

image

లండన్‌లో 16 ఏళ్లుగా భారతీయ వంటకాలను వడ్డిస్తున్న ‘రంగ్‌రేజ్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని ఓనర్ హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. పాకిస్థానీల నుంచి ఎదురవుతున్న దాడులు, ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ SMలో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కపూర్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.

News February 25, 2026

‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

image

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.

News February 25, 2026

నెతన్యాహు ‘హెక్సాగన్’ ప్లాన్: భారత్ కీలకం!

image

మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ నెతన్యాహు ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ అనే కొత్త కూటమిని ప్రతిపాదించారు. తీవ్రవాద శక్తులను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌లతో ఈ కూటమి ఏర్పడనుంది. పాక్-సౌదీల నాటో తరహా ఒప్పందానికి పోటీగా ఇది రానుంది. భారత్‌ను ఈ వ్యూహాత్మక కూటమిలో కీలక భాగస్వామిగా నెతన్యాహు అభివర్ణించారు. నేడు, రేపు (Feb 25, 26) ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటించనున్నారు.