News January 14, 2026
పండుగల్లో ఇలా రెడీ..

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.
Similar News
News March 29, 2026
జోనితా గాంధీ ఎవరంటే?

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.
News March 29, 2026
వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే?

ఎండ తాపాన్ని తట్టుకోవడానికి సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తాగుతుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. చల్లటి నీరు గొంతు గరగరకు కారణమవుతుంది. బాడీ వేడిగా ఉండే వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. కొందరికి తలనొప్పి, అలసటగా కూడా కలిగిస్తుంది’ అని చెబుతున్నారు.
News March 29, 2026
KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.


