News January 12, 2025

పండుగ సమయంలో ఎస్పీ కీలక సూచనలు

image

సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో పట్టణ ప్రాంతాల నుంచి ఊళ్లకు ప్రయాణం చేసే వారి పట్ల నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ప్రయాణం సమయంలో బ్లాక్ స్పాట్, యాక్సిడెంట్ జోన్ వంటి బోర్డులు గమనించాలన్నారు. రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు పొగ మంచు, రోడ్డుకు అడ్డంగా జంతువులు ఉన్న విషయాలను గమనించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్స్ డ్రైవింగ్ నిషేధమన్నారు. 

Similar News

News January 13, 2025

నెల్లూరు: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 13, 2025

నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా వాసుల సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. 

News January 12, 2025

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్ 

image

మూడు రోజులు పాటు జరిగే సంక్రాంతి పర్వదిన సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలని కోరారు.