News December 14, 2025
పంతిని సర్పంచ్‌గా శ్రీరామ్ భూపాల్‌రావు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్షణపల్లి శ్రీరామ్ భూపాల్‌రావు 592 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగించిన ఆయన ప్రత్యర్థులపై స్పష్టమైన పైచేయి సాధించారు. ఫలితాలు వెలువడగానే గ్రామంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీరామ్ భూపాల్‌రావు తెలిపారు.
Similar News
News December 15, 2025
45ఏళ్లలోపు వారికి గుండెపోటు ప్రమాదం.. కారణాలివే!

ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 45 ఏళ్లలోపు వారిలో సంభవించే ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని IJMR <<18568129>>నివేదిక<<>> హెచ్చరించింది. ఒత్తిడి, జీవనశైలి, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు యువత గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. యువత తమ జీవనశైలిని మార్చుకోవాలని, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT
News December 15, 2025
వరంగల్: చిన్నారి, వృద్ధురాలిపై వీధి కుక్క దాడి

జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం 40వ డివిజన్‌లో ఉర్సు ప్రాంతంలో వీధి కుక్క రెచ్చిపోయింది. పిచ్చి కుక్క దాడిలో చిన్నారి, వృద్ధురాలు గాయపడ్డారు. బాధితులను స్థానికులు అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
News December 15, 2025
KMM: వెంకటాపురంలో తండ్రిపై కొడుకుదే పై‘చేయి’

ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసాధారణ పరిస్థితి నెలకొంది. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తండ్రి రాయల వెంకటేశ్వర్లు సీపీఎం తరఫున సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందుల బాలచందర్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. బాలచందర్ 130 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.


