News December 12, 2025

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

Similar News

News December 12, 2025

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.

News December 12, 2025

వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ పోరాడుతోంది: పావెల్

image

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ తన మనుగడ కోసం పోరాడుతోందని ఆ దేశ క్రికెటర్ రోవ్‌మన్ పావెల్ అన్నారు. గతంలో ఆట ఎలా ఉన్నా ఇప్పుడు బాగా ఆడితే ఏ టీమ్ అయినా బాగానే కనిపిస్తుందని చెప్పారు. IPL 2026 మెగా వేలానికి ముందు KKR లాంటి ఫ్రాంచైజీ రూ.1.85 కోట్లకు తనను రిటైన్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సునీల్, రస్సెల్, బ్రావో ఉన్న టీమ్‌లో ఆడటం హోమ్ టీమ్‌లో ఆడుతున్నట్టే ఉంటుందని చెప్పారు.

News December 12, 2025

భారీ జీతంతో 340 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026కు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. దీని ద్వారా 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ/BE, బీటెక్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-26ఏళ్లు ఉండాలి. రాత, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ట్రైనింగ్‌లో ₹56,100, ఆ తర్వాత ₹1,77,500 వరకు జీతం ఉంటుంది. వెబ్‌సైట్: afcat.cdac.in/* మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.