News January 31, 2025
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు: భద్రాద్రి కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించొద్దన్నారు.
Similar News
News July 6, 2025
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.
News July 6, 2025
ఎన్టీఆర్: బీపీఈడీ, డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. జులై 15, 16, 17, 18 తేదీలలో ఉదయం 10 గంటలకు విజయవాడలోని వీకేఆర్ డిగ్రీ కాలేజీలో ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని KRU అధికారులు సూచించారు.
News July 6, 2025
PDPL: తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడికి షాక్

ఓ వృద్ధ తల్లికి బుక్కెడు బువ్వ పెట్టకుండా ఆశ్రయం కల్పించని ఓ పుత్రరత్నం కేసు విషయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ కన్నతల్లి సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన కుమారుడు ఉంటున్న ఇంటిని నెలరోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ,సంరక్షణ బాధ్యతలు పూర్తిగా పిల్లలపైనే ఉంటుందన్నారు. ఈ మేరకు కొడుక్కి నోటీసులు పంపారు.