News March 2, 2025
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 3, 2025
రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసుల వివరాలు.. తొర్రేడుకు చెందిన నరేంద్ర (45) పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI మనోహర్ తెలిపారు.
News March 3, 2025
తూ.గో: నేడే కౌంటింగ్.. జిల్లాలో ఉత్కంఠ

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లెక్కింపు నేడు జరగనుంది. 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా 27న జరిగిన పోలింగ్‌లో 63.26% ఓటింగ్ నమోదైంది. సోమవారం ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుల్‌లను ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మరి కొన్నిగంటల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ వీడనుంది.
News March 3, 2025
రాజానగరం: నన్నయ్య వీసీని ప్రశంసించిన సీఎం

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళ సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.