News April 16, 2024

పకడ్బందీగా చర్యలు చేపట్టాలి: ఏవీ రంగనాథ్ 

image

ములుగు జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మల్టీజోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛతీస్గడ్, ములుగు సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ బలగాల ద్వారా ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని, అక్రమ నగదు, మద్యం తరలింపుకు అడ్డుకట్ట వేయాలన్నారు. 

Similar News

News January 9, 2025

పదవీ విరమణ చేసిన హోంగార్డ్‌ను సత్కరించిన WGL సీపీ

image

సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోం గార్డ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గురువారం క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని హోం గార్డ్‌కు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ నాగయ్య, ఆర్.ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News January 9, 2025

మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి 

image

మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.