News March 21, 2025
పకడ్బందీగా పది పరీక్షలు: ఎస్పీ

పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 28, 2025
వనపర్తి: గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వినతి

బంజారా గిరిజన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంఘాల నేతలు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లా వాసి, బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పదవి విషయంలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించామన్నారు. తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని చెప్పామన్నారు.
News March 28, 2025
HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.
News March 28, 2025
నితిన్ ‘రాబిన్‌హుడ్’ రివ్యూ&రేటింగ్

అనాథలను ఆదుకునేందుకు హీరో దొంగగా మారడమే రాబిన్‌హుడ్ స్టోరీ. నితిన్, శ్రీలీల నటన బాగుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ కామెడీ వర్కౌట్ అయింది. చివర్లో ట్విస్టులు లేకపోవడంతో సినిమాను రక్తి కట్టించలేకపోయారు డైరెక్టర్ వెంకీ. మొదట్లో పవర్‌ఫుల్‌గా కనిపించే విలన్ క్యారెక్టర్ చివర్లో తేలిపోతుంది. పార్ట్-2 కోసమే డేవిడ్ వార్నర్ పాత్రను క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. సాంగ్స్ మైనస్.
రేటింగ్- 2.5/5