News February 20, 2025
పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 2, మార్చి 1వ తేదీన నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ మహేశ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News December 23, 2025
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, LT, టైటన్ లాభాల్లో.. ఇన్ఫీ, TCS, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News December 23, 2025
వరంగల్: గ్రామ సారథులకు సమస్యల స్వాగతం!

ఏడాదిన్నర కాలంగా క్షేత్ర స్థాయి పరిపాలన లేక బోసిపోయిన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,682 గ్రామాల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వారికి గ్రామాల్లో సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. ఇన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొచ్చారు. ప్రధానంగా సైడ్ డ్రైనేజ్ లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, నల్లా నీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News December 23, 2025
విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్‌వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.


