News June 21, 2024
పక్కపక్కనే కూర్చున్న రఘురామ.. అయ్యన్న

అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.
Similar News
News November 10, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 9, 2025
ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


