News April 15, 2025
పక్క పక్కనే షెడ్డులు ఉండటంతో ప్రాణనష్టం: ఎస్పీ

కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్‌ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. రెండవ నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్‌కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్‌లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
Similar News
News March 1, 2026
భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుంది: తుమ్మల

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు చేసిన మోసం బయటకు రాకుండా కొందరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు పశ్చాత్తాపపడతారన్నారు.
News March 1, 2026
నెల్లూరు గృహ నిర్మాణ శాఖ ఈఈ బదిలీ

గృహ నిర్మాణ శాఖ సంస్థ నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయనను కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా మోహన్ రావు స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు.
News March 1, 2026
రూ.5,456.26 కోట్లతో TTD బడ్జెట్.. కీలక అంశాలు!

☞ రూ.5,456.26 కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్ ☞విద్యాసంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్ల కేటాయింపు ☞ రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు ☞రూ.20.17 కోట్లతో ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవతుడి విగ్రహం, ఐలాండ్ నిర్మాణం ☞ రూ.8కోట్లతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఎక్స్-రే స్కానర్లు, లోహ గుర్తింపు పరికరాల ఏర్పాటు ☞ భద్రత కోసం తిరుపతిలో 356, తిరుమలలో 371 సిబ్బంది నియామకం.


