News March 21, 2024

పటాన్‌చెరులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 18, 2025

మెదక్: ఎన్నికల అధికారిని సన్మానించిన కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన మూడు విడతల స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారి జుల్ఫెక్వార్ అలీని శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికను అందచేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించి, ఎన్నికలు విజయవంతం చేసిన జుల్ఫెక్వార్ అలీని కలెక్టర్ అభినందించారు.

News December 18, 2025

మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

image

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News December 18, 2025

నర్సాపూర్: మూడో విడతలో అత్యధిక ఓటింగ్

image

మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికార ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు, 12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.