News July 10, 2025

పటాన్‌చెరులో స్కూల్ బస్సు దగ్ధం

image

సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే విద్యార్థులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పాక్షికంగా కాలిపోగా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News July 11, 2025

వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

image

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 11, 2025

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

image

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News July 11, 2025

కరీంనగర్: ప్రాణం తీసిన కోతులు

image

హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బూర సుదర్శన్ మృతిచెందారని స్థానికులు తెలిపారు. నెల రోజుల క్రితం ఇంటి వద్ద అతడిపై కోతులు దాడి చేసి, కుడి కాలును కరిచాయని చెప్పారు. తీవ్రంగా గాయమై సెప్టిక్ అయినందున ఎంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతిచెందారన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల కారణంగా ప్రాణం పోయింది.