News February 9, 2025

పటాన్‌చెరు: గంజాయి నిందితులు మహారాష్ట్రలో అరెస్ట్

image

గంజాయి కేసు నిందితులను పోలీసులు మహారాష్ట్ర వెళ్లి పట్టుకున్నారు. పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీసులు మహారాష్ట్ర వెళ్లి 220 కిలోల గంజాయి నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. 2024 సంవత్సరంలో 220 కిలోల గంజాయి నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు అమర్ సంజయ్ కావాల్, దిలీప్ ఆగడాలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పటాన్‌చెరు పీఎస్ SHO పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

Similar News

News December 29, 2025

సిద్దిపేట: 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సమాయత్తం

image

సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల వివరాలు.. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా జనాభా 16,544 మంది కాగా ఎస్టీలు 93, ఎస్సీలు 3,453 మంది ఉన్నారు. దుబ్బాకలో 20 వార్డులు ఉండగా జనాభా 27,496 మంది కాగా ఎస్టీలు 238, ఎస్సీలు 4,478 మంది, గజ్వేల్‌లో 20 వార్డులు ఉండగా జనాభా 37,881 మంది కాగా ఎస్టీలు 649, ఎస్సీలు 3,460, హుస్నాబాద్‌లో 20వార్డులు ఉండగా జనాభా 22,082మంది కాగా ఎస్టీలు 769, ఎస్సీలు 4,322 మంది.

News December 29, 2025

FLASH: నాగర్ కర్నూల్ లో మరోసారి ఎన్నికలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒నాగర్ కర్నూల్- 24 వార్డుల్లో 36,912 మంది
✒కల్వకుర్తి-22, వార్డుల్లో 30,091 మంది
✒కొల్లాపూర్-19 వార్డుల్లో 23,041 మంది ఉన్నారు.
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.

News December 29, 2025

నిజామాబాద్: నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌ కిరణ్

image

నిజామాబాద్ పట్టణానికి చెందిన శ్రీనికేష్ కిరణ్ 2025-26 సంవత్సరానికి నిర్వహించిన నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. బెస్ట్ స్విమ్మర్ అవార్డును అందుకోవడం భారతదేశానికి గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.