News October 25, 2025
పటాన్‌చెరు: బీరంగూడ శంభుని కుంట చెరువులో మృతదేహం

బీరంగూడ శంభుని కుంట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని మంజీరా నగర్ కాలనీ చెందిన తన్నీరు శ్రీను(49) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 25, 2025
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News October 25, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.
News October 25, 2025
ఇంటి చిట్కాలు

* 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 వంతు గోరువెచ్చని నీళ్లు పోసి క్లీనర్ రెడీ చేసుకోవాలి. దీంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు, ఏసీలపై మరకలు సులువుగా పోతాయి
* క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌ను స్టీలు స్క్రబ్బర్‌తో గట్టిగా తోమితే కుక్‌వేర్ పొర పోవచ్చు. వీటిని స్పాంజ్ స్క్రబ్బర్‌తో మైల్డ్ డిష్ సోప్ ఉపయోగించి తోమాలి.
* షవర్ జామ్ అయితే కాస్త వెనిగర్, నీళ్లు కలిపి దానికి పట్టేలా రాసి, గంట తర్వాత కడిగేయాలి.


