News May 2, 2024

పటాన్‌చెరు: ముత్తంగి వద్ద స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముత్తంగి శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద గల స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగనప్పటికీ, భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News January 13, 2025

మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం గం.8:30 AMవరకు నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, కోహిర్ 13.6 డిగ్రీలు, చోటకుర్, పుల్కల్ 14.0, నాల్కల్ 14.4, మెదక్ జిల్లాలో వెల్దుర్తి 14.6, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గ్ 15.2, టేక్మాల్ 15.4, రేగోడ్ 15.5, సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి 15.2, దుబ్బాక 15.3, మిర్దొడ్డి 15.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 13, 2025

MDK: వీధుల్లో భోగి మంటలు, రంగవల్లులు

image

పల్లెల్లో పొంగల్‌ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం వల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి.

News January 12, 2025

మెదక్: తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ

image

సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.