News June 23, 2024

పటాన్‌చెరు: రూ.1.05 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ.1.05 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాలు.. గోకుల్‌నగర్ చెందిన ఓ వ్యక్తికి జూన్ 14న టాస్క్‌లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామంటూ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను వివరాలు నమోదు చేసి దఫదఫాలుగా రూ.1.05 లక్షలు జమ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి స్పందించలేదు. మోసపోయానని బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News January 2, 2025

రేపు పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం: DEO

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రేపు అన్ని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

News January 2, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్‌ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్‌లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

News January 2, 2025

మెదక్: కొత్త ఏడాది.. 376 కేసులు నమోదు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 282, సిద్దిపేటలో 87, నర్సపూర్ లో 7 చొప్పున మొత్తం 376 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు.