News July 4, 2024
పటాన్‌చెరు: లింక్ క్లిక్ చేస్తే రూ.14 లక్షలు మాయం

పటాన్‌చెరు పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.14 లక్షలు పోగొట్టుకుంది. ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆమె ఆసక్తి చూపించగా సైబర్ కేటుగాళ్లు మొదట్లో లాభాలు చూపించారు. దాంతో ఆమె పెట్టుబడులు పెట్టారు. లింకు పంపిస్తున్నాం క్లిక్ చేయండి నగదు క్రెడిట్ అవుతాయని నమ్మించారు. అది నమ్మి క్లిక్ చేయడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ. 14 లక్షలు డ్రా అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News February 5, 2026
మున్సిపల్ ఎన్నికలు.. 2వ విడత రాండమైజేషన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల విధుల కోసం సిబ్బందిని ఎంపిక చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News February 5, 2026
న్యాయవాది హత్య.. మెదక్ జిల్లాలో విధుల బహిష్కరణ

చేవెళ్ల కోర్టు న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ మెదక్ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల భద్రత కోసం వెంటనే ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జనార్దన్ రెడ్డి, పోచయ్య, సంతోష్ రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2026
మెదక్: మున్సిపల్ ప్రచారంలో సర్పంచుల బిజీ!

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలను వదిలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లోని అభ్యర్థుల గెలుపు కోసం వీరు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో తిరుగుతూ అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సొంత గ్రామాల కంటే మున్సిపల్ వార్డుల్లోనే సర్పంచుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.


