News October 10, 2025
పటాన్‌చెరు LIGలో పేలుడు

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 10, 2025
ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో జీఎస్టీ 2.Oలో భాగంగా శుక్రవారం ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్ నుంచి గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిత్యావసర వస్తువులతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయన్నారు.
News October 10, 2025
ఒంగోలు: ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News October 10, 2025
NLG: రైతు కష్టం నీళ్ల పాలు.. పట్టించుకోకపోతే ఎట్లా?

నకిరేకల్ మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షానికి మండలంలోని PACS కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 500 బస్తాలకుపైగా ధాన్యం నీళ్లు, మట్టి పాలైంది. 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు.