News February 27, 2026
పటాన్‌చెరు: UKలో ఉన్న అన్నకు మెసేజ్.. MISSING

పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన నాగఅక్షయ లక్ష్మి (బీఏ ఫైనల్ ఇయర్), రుద్రారం గీతం యూనివర్సిటీలో చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తాను బయటకు వెళ్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యూకేలో ఉన్న సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 28, 2026
కల్వకుర్తి: రాజ్యసభ రేసులో వంశీచంద్ రెడ్డి..?

ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
News February 28, 2026
కప్పలబండలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

పుట్టపర్తి మం. కప్పలబండలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ స్వయంగా పింఛన్ నగదు అందజేశారు. నారాయణప్ప, లక్ష్మి తదితరుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందిస్తూ.. పంపిణీ సక్రమంగా జరుగుతుందా అని ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, గౌరవంగా మాట్లాడుతున్నారా వంటి వివరాలను లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 28, 2026
HYD: నమ్మండి.. ఇది రోడ్డే..!

ప్రతాపసింగారం-ఉప్పల్ రహదారి ముత్వెల్లిగూడలో నరకకూపంగా మారింది. R&B, మున్సిపల్, HMWSSB అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమైంది. మోకాలి లోతు గుంతలు ఏర్పడినా యంత్రాంగం కళ్లుమూసుకుంది. 15 రోజులుగా కృష్ణా నీటి పైప్‌లైన్ లీక్ అవుతున్నా జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇరు అధికారుల బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ఠగా మారి ప్రజలకు శాపమైంది.


