News November 21, 2025

పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

image

పటాన్‌చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్‌’ : కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 23, 2025

KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

image

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

image

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.