News July 7, 2025

పటాన్ చెరు: విషాదం.. ఫ్యానుకు టవల్ బిగుసుకుని విద్యార్థిని మృతి

image

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్లో విషాదం నెలకొంది. నాలుగో తరగతి చదువుతున్న సహస్ర ఫ్యానుకు టవల్ వేసుకుని ఆడుకుంటూ ఉండగా, ఒక్కసారిగా కరెంటు రావడంతో స్విచ్ ఆన్లో ఉన్న ఫ్యాన్ తిరిగింది. దీంతో టవల్ మెడకు బిగుసుకుపోవడంతో సహస్ర అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News July 7, 2025

రేపు సీఎం శ్రీశైలం పర్యటన షెడ్యూల్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 10.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. 12 గంటల సమయంలో డ్యామ్ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

News July 7, 2025

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 61 దరఖాస్తులు

image

ప్రజావాణి కార్యక్రమానికి 61 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు-29, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇళ్లు-7, ఇతర సమస్యలకు సంబంధించి 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.