News September 6, 2025

పట్టణ పాలనపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పట్టణాల్లో పాలన సమర్థవంతంగా కొనసాగాలని ఆదేశించారు. మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పని తీరుపై కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై పశువులు, కోతుల నియంత్రణ, డార్క్ ఏరియాల్లో లైటింగ్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 6, 2025

వరంగల్: దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4.35 కోట్ల వ్యయంతో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని 18 దేవాలయాల అభివృద్ధిని దశలవారీగా చేపడతామని తెలిపారు.

News September 6, 2025

మంచి నిద్ర కోసం ఇలా చేయండి!

image

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అయితే రాత్రి నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల ఆకులు నమలడం/హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి, పుదీనా, సెలరీ, వేప, అశ్వగంధ, బ్రహ్మి ఆకుల్లో ఏదైనా ఒక రకంలో నాలుగు ఆకులను నమలడం వల్ల మంచి నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.

News September 6, 2025

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రథమ ర్యాంకు

image

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు, జోనల్ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్‌ 2-4 మధ్య తమిళనాడు వెల్లూరులో జరిగిన అటారీ వార్షిక సమీక్షలో ఈ గౌరవం దక్కింది. డాక్టర్‌ ఎన్‌. వెంకటేశ్వరరావు అవార్డు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు శాస్త్రవేత్తల బాధ్యతను పెంచిందని, రైతులకు మరింత సేవలు అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.