News February 11, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంద్ర గౌడ్ నామినేషన్

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి సిలివేరి ఇంద్ర గౌడ్ సోమవారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా పోటీ చేశానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Similar News

News December 14, 2025

బ్రాహ్మణికి ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్’ అవార్డు

image

AP: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డును అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ముంబైలో నిన్న ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేసింది. నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, ప్రజలను శక్తిమంతం చేయడమని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డుల ద్వారా మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

News December 14, 2025

ప్రకాశం: గ్యాస్‌పై ఎక్కువ వసూలు చేస్తే.. నోటీసులే.!

image

సిలిండర్ డెలివరీకి అధికంగా పైసలు వసూలు చేస్తే IVRSకు పట్టుబడే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రభుత్వం తమ సేవల గురించి ప్రతి వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తుంది. ఈ విధంగానే గ్యాస్ వినియోగదారులకు కూడా కాల్స్ ద్వారా డెలివరీ సమయంలో ఇబ్బందులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వినియోగదారులు నేరుగా పలు గ్యాస్ ఏజెన్సీలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో దీనిపై ఆ ఏజెన్సీలకు అధికారులు నోటీసులిచ్చారు.

News December 14, 2025

మెదక్ : పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

మెదక్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రాజ్‌పల్లి, చిన్న శంకరంపేట్, నార్సింగి, పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.