News February 4, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన గవ్వల శ్రీకాంత్

image

జన్నారం మండలం కామన్‌పల్లికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, పట్టభద్రుల ఎమ్మెల్సీ‌కి సోమవారం కరీంనగర్లో నామినేషన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పట్టభద్రులు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.

Similar News

News March 14, 2025

అమెరికన్ NRIs బీకేర్‌ఫుల్… లేదంటే!

image

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్‌టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్‌గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్‌కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.

News March 14, 2025

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

image

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్‌కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్‌గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్‌కు దక్కింది.

News March 14, 2025

నిర్మల్: హంటర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

image

జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన హంటర్ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పలు హత్యలు దొంగతనాల కేసులను ఛేధించడంలో హంటర్ విశేష ప్రతిభను అందించిందని, పోలీసు శాఖకు అందించిన సేవలు వెలకట్టలేవని తెలిపారు.

error: Content is protected !!