News July 4, 2025
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం: జేసీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో రీ-సర్వే జరిగిన గ్రామాల్లో యడ్లపాడు, చిలకలూరిపేట, నకరికల్లు, నాదెండ్ల, నరసరావుపేట, నూజెండ్ల, పెదకూరపాడు, రొంపిచర్ల, శావల్యాపురం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు జేసీ సూరజ్ తెలిపారు. 9 మండలాలకు గాను 47,265 భూమి యాజ మాన్య హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
వనపర్తి: పోలీస్ డ్యూటీమీట్‌లో పతకాలు సాధించిన వారికి అభినందన

జోగులాంబ జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్‌లో వనపర్తి జిల్లాకు బంగారు 4, రజత 4, కాంస్య 5 మొత్తం 13 పతకాలు సాధించారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ అభినందించారు. నాగర్ కర్నూల్‌లో 2 రోజులపాటు నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో ఈ పతకాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలన్నారు.
News July 4, 2025
మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <
News July 4, 2025
జగిత్యాల: ‘డ్రెయిన్‌లు, వాగులు తక్షణం శుభ్రపరచాలి’

JGTL మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రత పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గోవిందపల్లి, శంకులపల్లి, సోడా సెంటర్, రామాలయం, SRSP కాలువ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్, నీటిపారుదల, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో పని జరగాలని, ప్రైవేట్ భూముల్లో ముల్లు మొక్కలు తొలగించకపోతే జరిమానాలు విధించాలన్నారు.