News July 26, 2024
పట్టిసీమ నుంచి 2,832 క్యూసెక్యుల నీరు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమలో నీటిమట్టం 22.987 మీటర్లు నమోదు కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్లతో నీటిని వదిలినట్టు వివరించారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల నేపథ్యంలో నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.
News February 22, 2026
ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.
News February 22, 2026
భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


